
రాప్తాడు ( జనస్వరం ) : చెన్నేకొత్తపల్లి గ్రామంలోని బిసీ కాలనీలో సిసి రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక జనసేన నాయకులు ఇటికోటి క్రాంతి కుమార్ అన్నారు. మట్టి రోడ్లు మొత్తం గుంతలు పడి వర్షాలు వచ్చినపుడు నీళ్లు నిలువ ఉంటున్నాయి. మురికి నీళ్ల కాలువలు కూడా లేక నీళ్లు మొత్తం దారిలోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు వినతిపత్రానికి జతచేసి ఎంపిడిఓ కు అందించడం జరిగింది. క్రాంతి కుమార్ మాట్లాడుతూ బిసీ కాలనీలో సిసి రోడ్లు మరియు మురికి కాలువలు వేయించి ప్రజల సమస్యను వీలైనంత త్వరగా తీర్చవలసిందిగా కోరామన్నారు. సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చూపని ఎడల ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.