Logo
Date of Publish : 11 May 2022, 1:27 pm
Editor : Sake Naresh

కౌలు రైతుల భరోసా యాత్ర పోస్టర్లును ఆవిష్కరించిన చీపురుపల్లి జనసేన నాయకులు

      చీపురుపల్లి, (జనస్వరం) : చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలో జనసేన నాయకులు సిగా తవిటి నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ లు విడుదల కార్యక్రమమునకు జమ్ము ఆదినారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జమ్ము మాట్లాడుతూ చనిపోయినటువంటి కౌలు రైతులకు 3000 వేల మందికి 30 కోట్లు రూపాయలు ఇచ్చిన దానిని జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్వహించినటువంటి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎప్పటి నుంచో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గానీ మరియు జిల్లాలో మంత్రులుగా గానీ ఉన్నప్పటికీ ఇప్పటికీ కనీసం తన సొంత నిధులు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని వైనం మనమందరం చూస్తున్నాము. అలాగే ఎన్ని ప్రభుత్వాలు మారిన అన్నం పెట్టే రైతులు పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరాష్ట్రంలో రైతులు పట్ల వారు ఎదురుకుంటున్న సమస్యలు పట్ల అవగాహన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమేనని, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో తన కష్టార్జితం నుంచి 30 కోట్ల రూపాయలు అందిస్తున్న మనసున్న వ్యక్తి  పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సిగ తవిటినాయుడు, దన్నన యేసు, యడ్ల సంతోష్, మహంతి సూర్యనారాయణ, మొయిద శ్రీరామ్, ముల్లు జగదీష్, పిన్నింటి సాయి, k.L. నరసింహమూర్తి, చందక బాలకృష్ణ, పొగిరి శ్రీరామ్, రామునాయుడు, దాసరి పైడితల్లి, గొల్లబాబు, నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com