నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 259వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం పోస్టాఫీసు వీధి వాటర్ ట్యాంక్ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధి పొందే వారికి 3 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలను అందివ్వాల్సిన ప్రభుత్వం ఆ రుణాలను ఇవ్వకుండా 10 వేల రూపాయలను జగనన్న చేదోడు అంటూ ప్రకటించారని, కానీ వాస్తవంలో చేదోడు అర్హులకు కాకుండా అనర్హులకు అందుతోందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు ఇబ్బడిముబ్బడిగా టైలరింగ్ వంటి నకిలీ ధ్రువపత్రాలను రూపొందింపజేసి అనర్హుల ఖాతాల్లో చేదోడు డబ్బు వేయించి వాటాల రూపంలో కోట్లాది రూపాయల నిధులను కాజేస్తున్నారని అన్నారు. దీంతో అర్హత కల్గిన వారికి అటు ప్రభుత్వ రుణాలు రాక ఇటు చేదోడు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ఉచితాల పేరుతో వైసీపీ ప్రభుత్వం స్కాములకు పాల్పడుతోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే స్వయం ఉపాధి పొందే ప్రతి ఒక్క అర్హులకు ప్రభుత్వ సాయం రుణాల రూపంలో అందుతుందని, అరకొర సాయం అందిస్తూ స్కాములు చేసే విధానానికి పవనన్న ప్రభుత్వంలో చెక్ పెడతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com