Logo
Date of Publish : 18 April 2022, 3:14 pm
Editor : Sake Naresh

సమాచార హక్కు చట్టం సహాయంతో గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ : టెక్కలి జనసేనపార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్

     టెక్కలి, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం,   సంతబొమ్మాళి మండలం, మూలపేట గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయంలో ప్రభుత్వ పథకాల జాబితాలు, ఇంటిపన్ను వసూళ్ల రికార్డులు గ్రామ పంచాయతీ గ్రాంట్ రికార్డులు, పంచాయితీ సంబందించి పలు రికార్డులు సమాచార హక్కు చట్టం సహాయంతో టెక్కలి ఇంఛార్జ్ కణితి కిరణ్ తనిఖీ చేయడం జరిగింది. అలాగే స్థానిక జనసైనికులు ఇచ్చిన సమాచారం మేరకు అర్హులైన కొందరికి ప్రభుత్వ పథకాలైన చేయూత, సామాజిక పింఛన్ల మంజూరు లోపాలపై అడిగి సమస్య పరిష్కారానికి చొరవచూపాలని అధికారులను కోరడమైంది. పాలనలో పారదర్శకత పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవినీతికి తావు లేకుండా, ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా, గ్రామంలో జరిగే పనులకి సంబందించి నాణ్యత లోపాలు తెలుసుకొనుటకు సమాచార హక్కు చట్టాన్ని ప్రతి పౌరుడు ఉపయోగించుకోవాలి అంటూ జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ తెలిపారు. అలాగే మూలపేట గ్రామ పంచాయతీలో రికార్డుల పరిశీలనలో 2018-2020 సంవత్సరాలకు గాను ఎటువంటి ఇంటిపన్ను రసీదు పుస్తకాలు, ఛలానాలు లేవని, పంచాయతీకి స్టాక్ రిజిస్టర్ లేదని, పంచాయతీకి GST నెంబర్ లేదని తమ దృష్టికి వచ్చిందని మరిన్ని వివరాలు కావాలని తెలుపగ పంచాయితీ కార్యదర్శి వారం రోజులలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సహకరించిన పంచాయతీ కార్యదర్శి మార్పు రామానాయుడుకి, అతని సిబ్బందికి టెక్కలి జనసేన పార్టీ తరుపున కణితి కిరణ్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ రికార్డుల తనిఖీ కార్యక్రమంలో లాయర్ ముడిదాన రాంప్రసాద్, అనపాన జనార్దన్ రెడ్డి, మూలపేట జనసేన నాయకులు భాస్కర్ రెడ్డి, బాలరాజు, గణేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com