Logo
Date of Publish : 17 May 2022, 5:09 pm
Editor : Sake Naresh

రైతులు సహా ప్రతి ఒక్కరిని మోసగించడం CBI దత్తపుత్రుడు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య

మదనపల్లి ( జనస్వరం ) : CBI దత్తపుత్రుడు జగన్ ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు ఏడాదికి పన్నెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. కిసాన్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఆరువేల రూపాయలు, రాష్ట్రం వాటా 7500 కలిపి 13500 ఇస్తున్న సీఎం జగన్ మొత్తం తానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి రైతుకు 20,000 ఎగ్గొట్టి రైతులను మోసగిస్తున్నది నిజమా కాదా అని అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది రైతులు ఉంటే 1.50 లక్షల మందికి రైతు భరోసా కింద 7500 రూపాయలు ఇస్తూ వారి జీవితాలను మార్చేస్తున్నట్లు సీఎం జగన్ గారు డబ్బా గొడుతున్నారు. రైతులకు ఇచ్చింది గోరంత అయితే విత్తనాలు, ఎరువులు విద్యుత్ చార్జీల పెంపు, వ్యవసాయ మోటార్లు మీటర్ల పేరుతో లెక్కల్లో చెప్పలేనంత. లక్షల లోపు ఋణాలకు ఉచిత వడ్డీ అని సీఎం అన్నారు. ఎక్కడైనా అమలవుతుందా అని అన్నారు. కేంద్ర సహకార బ్యాంకులు రుణం తీసుకున్న రైతుల నుండి బలవంతంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. జొన్న మొక్కజొన్న కొనుగోలు పేరుతో రైతు భరోసా కేంద్రాన్ని అడ్డంపెట్టుకుని వైకాపా నేతలు లక్షాధికారులు అయితే రైతులు మాత్రం బికారులవుతున్నారు. అప్పులపాలై ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు... ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల జీవితాలలో నింపిన వెలుగు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com