నిరుద్యోగుల విషయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత అదిగో జాబ్ ఇదిగో క్యాలెండర్ అంటూ యువతకు ఆశలు కల్పించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారని రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మెన్ రేఖగౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామిఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మడమ తిప్పడం ఏంటని ప్రశ్నించారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చెయదగ్గ ఉద్యోగాలు భారీగా ప్రతియేటా ఖాళీ అవుతున్న లెక్కలను చూపించకుండా ప్రభుత్వం దాచిపెట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ల్లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చూపుతూ హామీ లక్షల్లో ఇచ్చి భర్తీ మాత్రం నామమాత్రంగా చేయడం ద్వారా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అదేవిధంగానే రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న వాటి భర్తీకి సంబంధించి డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. వాలంటీర్ ఉద్యోగాలు లక్షల్లో భర్తీ చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం వాలంటీర్లు తమకు జీతాలు పెంచాలని ఆందోళనలకు సిద్ధమైతే మీవి ఉద్యోగాలు కావు స్వచ్ఛంద సేవా మాత్రమే అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం జాబ్ క్యాలెండర్ ప్రచారంకోసం వాళ్ళవి ఉద్యోగాలు అని చెప్పడంతో ఎవరిని వంచిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా శాఖల వారిగా ఉన్న ఖాళీలను పారదర్శకంగా గుర్తించి ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com