చేజర్ల, (జనస్వరం) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసానికి, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆత్మకూరులోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ గారి చేతుల మీదగా చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ గారి ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రాబోయేది జనసేన ప్రభుత్వమేనని కాబోయే సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని కంఠపధంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, బలరాం, అరవింద్, అన్ని మండలాల ఇంఛార్జ్ లు, నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com