
కదిరి, (జనస్వరం) : అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు శ్రీ రవణం స్వామినాయుడు, అఖిల భారత రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ భవానీ రవి కుమార్, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ కడపల సుధాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బాలప్ప గారి పల్లిలో ఉచిత త్రాగునీరు పంపిణీ, కుమ్మరోళ్లు పల్లి గ్రామంలో వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం, అమృతవల్లి డిగ్రీ కళాశాల నందు మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్, సలహాదారుడు లక్ష్మణ కుటాల, అమృతవల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకటపతి, మెగా అభిమానులు, యువ ఫౌండేషన్ సభ్యులు పాల్గొనటం జరిగింది.