ఇటీవల కురిసిన స్వల్ప పాటి వర్షాలకు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వెంకటరెడ్డి పల్లి దళితవాడలో సరైన రోడ్లు లేని కారణంగా చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి అనేక మంది టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి అనేక విష జ్వరాలు బారిన పడి తీవ్ర అనారోగ్యాపాలవుతున్నారు. ఈ క్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు పాత్రికేయులకు తెలియజేస్తూ తమ గ్రామంలో పారిశుద్ధ్య లోపం వల్ల, త్రాగునీరులో మలినాలు అధిక మోతాదులో వస్తు౦డటం వలన అనారోగ్య పాలైన వాళ్ళల్లో, తమతో పాటు తమ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అన్నారు. పిల్లలు, పెద్దలు వృద్ధులు అనే తేడా లేకుండా విష జ్వరాలు బాధిస్తున్నాయని వాపోయారు. గతంలో ఇలా జరగొచ్చని ముందే హెచ్చరించారు. కానీ ఆ విషయాన్నీ పట్టించుకోని అధికారులు పెడచెవిన పెట్టారు. ఇప్పటికైనా తక్షణమే ఆరోగ్య పరమైన రక్షణ చర్యలను చేపట్టాలని త్రాగునీటినీ పరీక్షించాలని కోరారు. అలాగే మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పారిశుద్ధ్యంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా నగరపాటి మహేష్ తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com