అరకు, (జనస్వరం) : అనంతగిరి మండలం వాలసి పంచాయితీ పరిధిలో గల జెండాగర్రు గ్రామంలో గల యువకులు మరియు వాలీబాల్ ఆటగాళ్ల తో జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పర్యటించి వారితో సమావేశమై జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు రావాలంటే ముందుగా ను యువతలో మార్పు రావాలని, మార్పుకు నాంది పలుకుతునటువంటి జనసేన పార్టీకీ మీరందరూ ఆదరించాలని, మద్దతు ఇప్పుడు ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీను, యేసు రత్నం, దావీదు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com