Logo
Date of Publish : 12 January 2024, 9:58 pm
Editor : Sake Naresh

జనసేన తోనే మార్పు సాధ్యం

       రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం సుండుపల్లి పంచాయతీలోని పలు గ్రామాలలో పత్తివాళ్లపల్లి, కట్టకిందపల్లి, ఈడికిపల్లి, రెడ్డివారిపల్లె, పెద్ద బలిజపల్లి లలో 138వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లె వీర మహిళ సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ,వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన తోనే మార్పు సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు.రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిపార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు,చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, కిషోర్, జనసేన వీర మహిళలు రజిత, సుగుణమ్మ, లక్ష్మమ్మ, శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com