ఎచ్ఛర్ల ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ గారి మరియు రాష్ట్ర కార్య నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ డా విశ్వక్షేణ్ గారి ఆధ్వర్యంలో సుభద్రాపురం నుండి వీరమహిళలు, జనసైనికులు ర్యాలీగా కవాతు చేసుకొని లావేరు మండలం వెంకటాపురం జంక్షన్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ వేదిక లో మండల నాయకులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com