Logo
Date of Publish : 12 January 2026, 5:15 pm
Editor : Sake Naresh

ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రగిరి వెంకటరమణ నియామకం

విజయవాడ, జనవరి 12, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ వడ్డెర్ల బీసీ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రగిరి వెంకటరమణను నియమించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ బి.లల్య నాయక్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు చంద్రగిరి వెంకటరమణకు అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఎల్.సి.సి.ఎస్.డబ్ల్యూ.ఏ నియమ నిబంధనల ప్రకారం బాధ్యతలు నిర్వహించాలని, రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇచ్చే సూచనలు, సలహాల మేరకు అసోసియేషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. న్యాయపరమైన వ్యవహారాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ అసోసియేషన్ బైలా నియమ నిబంధనలను గౌరవిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బెల్డోన గిరి యాదవ్ బీసీతో పాటు అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com