Logo
Date of Publish : 03 June 2022, 8:04 am
Editor : Sake Naresh

బడుగు బలహీనవర్గాలకు అండగా, అంబేద్కర్ గారి ఆశయాలకోసం చంద్రగిరి జనసేనపార్టీ భారీ నిరసన ర్యాలీ

           చంద్రగిరి ( జనస్వరం ) : చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఉన్న అంబేడ్కర్ గారి విగ్రహాన్ని శాశ్వతంగా ఏర్పాటు చెయ్యాలని పలుధఫాలు అధికార ప్రభుత్వాన్ని కోరారు. ఫలితం లేకపోవడంతో, అంబేడ్కర్ యువజన సంఘాలతో కలిసి చంద్రగిరి జనసేన నాయకులు దేవర మనోహర గారి నాయకత్వంలో  చంద్రగిరి బ్రిడ్జి కూడలి నుండి టవర్ క్లాక్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ గారి తాత్కాలిక విగ్రహానికి పూలమాల వేసి, అక్కడ నుండి ఎం.ఆర్.ఓ ఆఫీసు వద్దకు వెళ్లి వారికి అంబేడ్కర్ గారి శాశ్వత విగ్రహ ప్రతిష్ట చేపట్టాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవర మనోహర గారు మాట్లాడుతూ హిందువులకు భగవద్గీత ఇచ్చింది కృష్ణుడు, ముస్లింలకు ఖురాన్ని ఇచ్చింది మహమ్మద్ ప్రవక్త, క్రిస్టియన్స్ కి బైబిలిచ్చింది జీసస్, అలా భారతీయులకు రాజ్యాంగాన్ని ఇచ్చి అంబేద్కర్ దేవుడయ్యారు అని పేర్కొన్నారు. వీధి వీధికి వై.ఎస్.ఆర్ విగ్రహాన్ని పెట్టిన ప్రభుత్వానికి, అంబేడ్కర్ గారి విగ్రహం ఎందుకు అడ్డు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, మండల అధ్యక్షులు సుంజీవి హరి, వేంకట రాయల్, సుబ్రమణ్యం, పలు మండల నాయకులు  కిరణ్,  చరణ్ రాయల్, మురళి, ఆశా, రాకేష్,  సాయి లక్ష్మణ, రాంబాబు, ప్రతాప్, సాయి, దామినేడు యువరాజ్ బాల గుర్రప్ప, శేఖర్, వెంకటేష్, హరీష్ మరియు ఇతర జనసైనికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com