Logo
Date of Publish : 01 January 2022, 11:06 am
Editor : Sake Naresh

వృద్ద దంపతులకు నిత్యావసర సరుకుల అందించిన చంద్రగిరి జనసేన నాయకులు

   చంద్రగిరి, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, మంగళం పంచాయతీ, గిరిప్రసాధ్ కాలానికి చెందిన అలిమేలు, దంపతులు కటిక పేదరికంలో జీవనం సాగిస్తుండగా, క్రింతం కురిసిన భారీ వర్షాలకు ఇంటి పైకప్పు మొత్తం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అందులో ఇద్దరు వృద్ధులు, ఆయనకు అంగవైకల్యం మరియు ఉన్న ఒక్క కుమారుడికి మతిస్థిమితం బాగలేకపోవడం బాధాకరం. వీరికి మూడు నెలలు సరిపడ బియ్యం బస్తాలు, ముడి సరుకులను అందజేయడం జరిగింది. అర్హులైనప్పటికి ప్రభుత్వం నుండి రావాల్సిన పింఛను అందకపోవడంతో వారికి అండగా ఉండి వారి తరపున స్థానిక ప్రభుత్వ అధికారులతో మాట్లాడి లబ్ధి పొందే చేస్తానని నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర గారు బరోసా కల్పించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వివేక్ బాబు గారు మాట్లాడుతూ అర్హులైనప్పటికి వారికి పింఛను అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందని వారికి తక్షణమే న్యాయం చేకురేల చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే కటిక పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఎవరైనా దాతలు ఆదుకోవాల్సినదిగా ఆకాంక్షించారు మరియు వారికి ప్రస్తుతానికి ఉండటానికి నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వివేక్ బాబు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి చంద్రగిరి నాయకులు దేవరామనోహర్ ఇతర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com