చంద్రగిరి ( జనస్వరం ) : చంద్రగిరి నియోజకవర్గంలో NH 140 వల్ల నష్టపోతున్న పనపాకం స్థానికులకు & రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించి వారికి పునరావాసం కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి, రైతులతో కలిసి వెళ్ళి వారు పడుతున్న ఇబ్బందులను తెలిపి, వినతిపత్రం సమర్పించారు జనసేన నాయకులు. వారు మాట్లాడుతూ స్థానిక NH -140, నాయుడు పేట నుంచి చిత్తూర్ వైపు వెళ్తున్న ప్రధాన రహదారిలో పనపాకం పంచాయతీలోని ఇరివిశెట్టిపల్లె వాస్తవ్యులు దాదాపు 20 మందికి పైగా ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న ప్లాట్స్ మరియు వివిధ రకాల ఆహోరాత్పత్తులు పండించుకుంటున్న భూములు కోల్పోతున్నారని, వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే బలవంతగా అదికూడా నామమాత్ర మైన నష్ట పరిహారం చెల్లించారు మిగిలిన 17 మంది రైతులకి ఎటువంటి నష్ట పరిహారం చెల్లించలేదంటూ వాపోయారు. NHAI దౌర్యజన్యంగా పనులు ప్రారంభించటంతో, ఇది ఎంతవరకు న్యాయం అని రైతులు ప్రశ్నించగా అధికారులు తిరగపడడంతో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా చర్యలు తీసుకోకపోవడంతో వారు జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు దేవర మనోహర, ఆకేపాటి సుభాషిణి కలిసి వారి బాధలను, పడుతున్న ఇబ్బందులను తెలిపారు. జనసేన ప్రజల పక్షాన నిలబడి బాధితులకి న్యాయం జరిగే విధంగా కింద కనపర్చిన డిమాండ్లు పరిశీలించి న్యాయం చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, సంజీవి హరి, వాకా మురళి తదితరులు పాల్గొని రైతులకు అండగా నిలవడం జరిగింది.
1. NHAI వారు కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం The Right to Fair Compensation and Transparency in Land Acquisation, Rehabilitation and Resettlement Act, 2003 ప్రకారం నష్ట పరిహారాన్ని లెక్కించి నష్ట పరిహారం చెల్లించాలి.
2. ప్రభుత్వ అధికారులు నష్ట పోతున్న స్థానికుల ఇల్లు భూములను రీ-సర్వే చేసి ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రస్తుత మార్కెట్ ఆధారంగా నష్ట పరిహారం చెల్లించాలి.
3. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు బిల్డింగ్ విలువ మరియు భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం అంచనా వేసి రీ-సర్వే చేసి న్యాయపరంగా చట్టం ప్రకారం నష్ట పరిహారం అందించాలి.
4. వ్యవసాయ సాగు భూములకు ఆ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా రీ-సర్వే చేసి మరియు ఆ భూములలో ఉన్న చెట్లు, పంటలు మరియు ఏ ఇతర అన్నింటిని కలిపి నష్ట పరిహారం చెల్లించాలి.
5. వీరందరికి తక్షణమే వాళ్ళు ఇంతకు మునుపులాగా జీవించే విధంగా రోడ్డుకి దగ్గర ఉన్న ప్రదేశాలలో అనువైన భూములలో వారికి పునరావాసం కల్పించాలి.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, రైతులు, బాధితులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com