చంద్రగిరి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రగిరి నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ కీలక నేతలు, సీనియర్ నాయకులు చేరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు తపసి మురళి రెడ్డి, మరియు గోపి రాయల్ వారి అనుచరలుతో దేవర మనోహర ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో చంద్రగిరి కోటపై జనసేన జెండా ఎగరాలని ఆకాక్షించారు. దేవర మనోహర గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని, అలాంటిది చంద్రగిరిలో ఈ చేరికలు చూస్తున్నట్లయితే నియోజకవర్గంలో అభివృద్ధిపై ఆశలు చిగురింపజేస్తున్నయని రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ముందుకు వచ్చి జనసేనతో ప్రయాణించాలని ఈ రాష్ట్ర దశా దిశా మార్చే నాయకుడి వెంట నడవాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో భారీ చేరికలు ఉంటాయని, నియోజకవర్గంలోని ఇతర పార్టీ కీలక నేతలు, ప్రముఖులు చేరుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, యువ నాయకులు పగడాల యువరాజ్ రాయల్, నూనె దిలీప్ మరియు లోహిత్ రాయల్, M రమేష్, నాగరాజు, గౌతమ్ గౌడ్, సుందర్ రాజు, లోకి రాయల్, కే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com