
చంద్రగిరి, (జనస్వరం) : జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అద్దం పట్టేలా పార్టీ సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 2022 క్యాలెండర్ రూపొందించి వాటిని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంచేలా చేపట్టిన నగరి నాయకుల ఆదేశానుసారం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం, అర్బన్ మండలంలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి క్యాలెండరును గడప – గడపకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, మండల అధ్యక్షులు యువకిషోర్, జనసేన సాయి, బాలు ఇతర జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.