అనంతపురం ( జనస్వరం ) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బుధవారం నాడు టిడిపి వారు చేపట్టిన కాగడాల ర్యాలీకి జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతూ పెండ్యాల శ్రీలత పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం సీఎం జగన్ శాడిజానికి నిదర్శనమని రాజకీయ కక్షతోనే అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ తనలా చంద్రబాబు చేసిన ప్రతి పనిలోనూ అవినీతి ఉందని భావించడం మూర్ఖత్వమని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2.40 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని వారిలో 72వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం వాటా సమకూర్చిన ఈ ప్రాజెక్టులో రూ.279 కోట్లు అవినీతి జరిగిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 18 నెలలకు ఏ విధంగా అరెస్టు చేస్తారని వైకాపా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి వీర మహిళలు శైలజ, లక్ష్మి, గాయత్రి నాయకులు కొల్లా శివయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com