
గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి అప్రజాస్వామిక అరెస్టును నిరసిస్తూ ఈ రోజు జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మారాపు సురేష్ మరియు తెలుగుదేశం పార్టీ గజపతినగరం నాయకులు శివరామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన బందకు మారాపు సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున గజపతినగరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సురేష్ గారు మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు గారు అరెస్ట్ తీరు అప్రజాస్వామికమని అన్నారు,చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నామన్నారు. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం అన్నారు,పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారి పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదన్నారు. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని జనసేన కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు,ప్రజాస్వామ్యంను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు.ప్రజలని భయభ్రాంతులను చేయ్యడానికే జగన్ ఇలా చేస్తున్నారని, చంద్రబాబు నాయుడునే వదలలేదు,ఇక మీరు ఎంత అని సామాన్యలను హెచ్చరించడానికే ఇలా చేస్తున్నారని అన్నారు ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు, అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదన్నారు,జగన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపి తీరుతామన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు డా.రవి కుమార్ మిడతాన, గజపతినగరం నియోజకవర్గం నాయకులు పండు, మహేష్, రాము, ఆదినారాయణ, అనిల్, శంకర్ పాల్గొన్నారు.