రాజంపేట ( జనస్వరం ) : వరద బీభత్సవానికి అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టకపోయి ప్రాణ ఆస్తి నష్టం జరిగి రెండేళ్లు కావస్తున్న ప్రభుత్వం ఇంతవరకు వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం దుర్మార్గమని అన్నమయ్య జిల్లా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్, రాయచోటి అసంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ హసన్ భాష విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ నేడు జనసేన ఆధ్వర్యంలో 'చలో రాయచోటి 'కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం రాయచోటిలోని స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జలాశయం కొట్టుకుపోవడంతో నిలువు నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులను ప్రభుత్వం పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండేళ్ల గడుస్తున్నా ఇంతవరకు వరకుఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. వరద బాధితులకు న్యాయం జరిగేంత వరకు జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. చలో రాయచోటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, సానుభూతి మరియు మద్దతు దారులు, ప్రజాసంఘాలు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రదీప్, షబ్బీర్, మైనార్టీ సీనియర్ నాయకులు బాబుజాన్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com