గజపతినగరం ( జనస్వరం ) : ఈ నెల 12న జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువశక్తి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గంట్యాడ మండలం అధ్యక్షులు నరవ్ గ్రామంలో యువశక్తి సమావేశాన్ని సారధి అప్పలరాజు ఏర్పాటు చేశారు. డా.రవికుమార్ మిడతాన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం పోగొట్టడానికి, యువతలో చైతన్యం తెచ్చేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం జగన్ పరిపాలనా వైఫల్యంతో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నదని, కొందరు యువకులు గంజాయికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం లేదన్నారు. మూడు రాజధానుల పేరుతో విశాఖలోని భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు, వైసీపీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసంచేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల సభలను అడ్డుకునేందుకే ఆంక్షలు విధిస్తూ జీఓ విడుదల చేశారని ఆరోపించారు. యువశక్తి కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఫలితం ఉండదని తెలిపారు. మండల అధ్యక్షులు అప్పలరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వలసలు, ఉపాధి లేమి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు వంటి అన్నీ అంశాలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు యువశక్తి కార్యక్రమం వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ మండలం నాయకులు అడపా రాంబాబు, ఈశ్వరరావు, నాయుడు ,కోటి, చంటి, రాంబాబు, చిన్ని కృష్ణ, ప్రశాంత్, జామి మండలం నాయకులు బాలకృష్ణ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.