బొబ్బిలి ( జనస్వరం ) : రాష్ట్రం మొత్తం మీద జగనన్న లేఅవుట్లు పేరుతో చేసిన మోసం, అవినీతి ఒకెత్తైతే, ఈరోజు బొబ్బిలిలో అసంపూర్ణమైన లేఅవుట్ ప్రారంభోత్సవం పేరుతో వైసీపీ పార్టీ చేస్తున్న అట్టహాసం అంతా ఇంతా కాదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద ఏ లేఅవుట్ లోనూ రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, వాటర్ సప్లై లేదు, కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా లేదని, ఇళ్ల నిర్మాణం కనీసం 10% కూడా పూర్తి చెయ్యలేకపోయారన్నారు. కానీ ఈరోజు బొబ్బిలి ITI కాలనీ, స్టేట్ హైవే ప్రక్కన కేవలం 10% మాత్రమే పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, 90% వీరి పార్టీ నాయకులకి, బడాబాబులుకే ఇచ్చుకున్నారని అన్నారు. ఇక్కడ కూడా రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయం కల్పించకుండానే.. హడావుడిగా వైసిపి మంత్రి జోగి రమేష్, బొత్స, రాజన్న దొర, చిన్న శ్రీను, MPలు, MLAలు కట్టగట్టుకుని బొబ్బిలికి వచ్చి ఏ మొహం పెట్టుకుని ప్రారంభోత్సవం చేస్తారని అన్నారు. శాంతియుతంగా మన ప్రజలు మరియు జగనన్న లేఅవుట్లు లబ్దిదారుల తరపున రేపు ప్రశ్నిద్దామని పిలుపునిచ్చారు.. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న మన జనసేన పార్టీ శ్రేణులందరూ రేపు ఉదయం 9:30 గంటలకు బొబ్బిలి జనసైనికుల నిలయం (మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా) వద్దకు చేరుకుంటే, అక్కడ నుంచి అందరం కలసి ITI కాలనీ దగ్గరకి చేరుకుందామని పిలుపునిచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com