చిలకలూరిపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నందు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తోటరాజ రమేష్ మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు మండల లేని చరణ్ తేజ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా , పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చిలకలూరిపేట జనసేన పార్టీ పనిచేస్తుందని అందులో భాగంగా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చే విధంగా పట్టణంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు. రానున్న కాలంలో పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరికొన్ని మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, చిలకలూరిపేట మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, స్టీల్ అంజి, సాంబ, శివశంకర్ ,సాయి, వెంకటేష్, సూర్య, వెంకటస్వామి, జానీ భాష, శ్రీనివాసరావు, జగన్, పెద్దింటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com