హైదరబాద్ ( జనస్వరం ) : కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలోని కె.పి.హచ్.బి రమ్య గ్రౌండ్ వద్ద తుమ్మల మోహన్ కుమార్, కొల్లా శంకర్ గారి ఆధ్వర్యంలో 'చలివేంద్రం’ ప్రారంభించడం జరిగినది. ఈ ఏడాది కూడా మండుతున్న ఎండల నుంచి ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో సోమవారం తెలంగాణ జనసేన పార్టీ స్టేట్ ఇంచార్జ్ నెరుమూరి శంకర్ గౌడ్, మండలి దయాకర్ కావ్య గారు చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ వేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో నిర్వహిస్తున్న చలివేంద్రా కేంద్రం నిర్వహిస్తూ ప్రజల యొక్క దావాద్రి తీర్చుతున్న నాయకులు తుమ్మలమోహన్, కొల్లా శంకర్ మరియు జనసేన వీర మహిళలకు అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, ఆంజనేయులు, సత్యనారాయణ, నాగ చరణ్ , వెంకటలక్ష్మి మహాలక్ష్మి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com