పెందుర్తి, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా, పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామం, 88వ వార్డ్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ పేరు మీద నరవ హైస్కూల్ జంక్షన్ వద్ద వీర మహిళ మీనాక్షి చేతుల మీదగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్ధన శ్రీకాంత్ వబ్బిన మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతున్నందున నరవ జనసైనికులు ఆధ్వర్యంలో ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నాను అని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. వీరమహిళ పార్వతి మాట్లాడుతూ మీరందరూ ఇదే విధంగా నిరంతరం పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని కోరడం జరిగింది. నాయకులు కంచిపాటి మధు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అదేవిధంగా నరవ జనసైనికులు కూడా సేవా కార్యక్రమాలు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారని అందులో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం అన్నారు. వీరమహిళ గొన్న రమాదేవి మాట్లాడుతూ ఎండలు తీవ్రత పెరగడం వలన పెందుర్తి నియోజకవర్గంలో జనసందోహం ఉన్న ప్రాంతాల్లో జనసేన పార్టీ చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మనపై ఉందని, ఇటువంటి కార్యక్రమాలకు నన్ను భాగస్వామిని చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, వైకుంఠ రావు, గోవింద్, గోపి, శేఖర్, శ్రీను, బొబ్బరి శీను, తేజ, శ్యామ్, నవీన్, ప్రవీణ్, శివ, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.