
ఆచంట ( జనస్వరం ) : పెనుమంచిలి గ్రామంలో జనసేనపార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మంగిన రాము ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదటగా గ్రామ జనసేనపార్టీ MPTC అభ్యర్థి వెంకటలక్ష్మి మోహన్ రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గ్రామంలో జనసైనికులు చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా బాటసారులుకు దాహం తీరుస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, అయన సేవాగుణాన్ని ఆదర్శంగా తీసుకుని జనసేనికులు నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అభినందించారు. జనసేనపార్టీ గ్రామ అధ్యక్షులు మంగిన రాము మాట్లాడుతూ జనసేనపార్టీ స్థాపించిన నాటినుండి గ్రామంలో ప్రతీ సంవత్సరం జనసైనికులు అందరి సహకారంతో మూడు నెలలు పాటు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుంటుందని, అలాగే ఈ సంవత్సరం కూడా జనసైనికుల సహకారం తో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, యర్రంశెట్టి సిద్దు, వేంప శ్రీను, దేవిరెడ్డి చినబాబు, చామన రమేష్ బాబు, కోర్లపాటి ఆనంద్, వాలా దుర్గాప్రసాద్, భూశారపు నాగేంద్ర తదితర జనసైనికులు పాల్గొన్నారు.