హైదరాబాదు ( జనస్వరం ) : KPHB కాలనీ 114 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొల్లా శంకర్ మరియు బాలాజీ నగర్ 115 డివిజన్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో KPHB కాలనీ 3వ ఫేస్ రమ్య గ్రౌండ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ వీరమహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి మజ్జిగతో ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎండలు బాగా వున్నాయని పాదచారులు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారని, ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందుకు వచ్చి ఈ చలివేంద్రాలు పెట్టటం అభినందనీయమని, ఇదే విధంగా మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కూకట్పల్లి నియోజకవర్గం లో అన్ని డివిజన్ లో ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి (కేబుల్ ), వినోద్ కుమార్ .దొరబాబు .మహాలక్ష్మి మరియు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.