సత్తెనపల్లి ( జనస్వరం ) : రాజుపాలెం మండలంలో స్వాతంత్ర్య సమరయోధుడు పద్మభూషణ్, స్వర్గీయులువావిలాల గోపాల కృష్ణయ్య గారి 20వ వర్ధంతి సందర్భంగా మండల కార్యాలయం నందు గోపాలకృష్ణ గారికి మండల అధ్యక్షుడు తోట నరసయ్య ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు గారు ఘన నివాళులర్పించడం జరిగినది. అనంతరం మండల కేంద్రంలో*డొక్కా సీతమ్మ గారి ఉచిత మంచినీటి చలివేంద్ర౦ నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ మిగతా పార్టీల్లో అందరి నాయకుల్లా తమ సొంత పేరుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందరో మహానుభావుల స్ఫూర్తితో ఆ మహనీయుల పేర్లు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం చూశామన్నారు. భావితరాలకు ఆదర్శంగా వారి యొక్క స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఇలాంటి మహానుభావుల పేర్లు మీద ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక జనసేన పార్టీకే ఈ గొప్పతనం దక్కుతుందని అన్నారు. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయాలని జనసైనికులు పిలుపునివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో అనుపాలెం గ్రామ అధ్యక్షుడు, తోట లక్ష్మీనారాయణ, రాజుపాలెం మండలం గ్రామ అధ్యక్షులు, మండలంలోని మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com