Logo
Date of Publish : 04 March 2026, 10:39 am
Editor : Sake Naresh

హిందూపురంలో 200 ‘ఉద్యమి’ సభ్యత్వాలు నమోదు చేసిన చక్రి

హిందూపురం, మార్చి 3, (జనస్వరం) : జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా హిందూపురం మండల అధ్యక్షుడు, జనసేన సాధక్ పి. చక్రవర్తి (చక్రి) ఆధ్వర్యంలో 200 సభ్యత్వాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చక్రవర్తిని ప్రత్యేకంగా అభినందించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత కృషి చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సభ్యత్వాల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా మంచి స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది యువత, మహిళలు జనసేనలో చేరి పార్టీని బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com