● పవనన్న ప్రజాబాటలో జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద వాపోయిన పలువురు మహిళలు
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 116వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్ లోని ప్రాగ్జ్యోతి స్కూల్, మైత్రీ వాటర్ ప్లాంట్ ప్రాంతాలలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు మహిళలు ఈ ప్రాంతంలో సాయంత్రం 7 గంటల నుండి కాస్త చీకటి పడిందంటే బయట తిరగలేకపోతున్నామని వాపోయారు. మోటారు బైక్ల మీద వచ్చి పలువురు చైన్ స్నాచర్లు మహిళల మెడలో బంగారు గొలుసులను తెంపుకుపోతున్నారని, ఒంటి మీద నగలు వేసుకోవాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చైన్ స్నాచర్ల దాడిలో గాయపడిన ఓ మహిళ కోమాలోకి వెళ్లిందని అన్నారు. నిన్న సాయంత్రం కూడా చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో గొలుసుని తెంపుకుపోయారని వాపోయారు. సమస్యను సావధానంగా విన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తరచుగా ఇలాంటి సంఘటనలే జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. పోలీసుల భయం లేకుండా చైన్ స్నాచర్లు విచ్చలవిడిగా ఈ ప్రాంతంలో చెలరేగుతున్నారంటే దానిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని అన్నారు. పోలీసులు ఈ ప్రాంతంలో రాత్రి గస్తీలు పెంచాలని, పెట్రోలింగ్ సిబ్బందిని అదనంగా పెట్టాలని, ప్రజల్లో భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని పెంచాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.