నర్సాపురం ( జనస్వరం ) : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయం వద్ద చాగంటి మురళీకృష్ణ (చిన్న) గారి దంపతులు మరియు ఆయన సోదరులు చాగంటి పార్థసారధి గార్ల దంపతులచే పూజలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులు మరియు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com