పత్తికొండ ( జనస్వరం ) : మండలం పరిధిలోని పెండేకల్ రైల్వే జంక్షన్ లో జనసేన పార్టీ నాయకులు , అల్తాఫ్ తండ్రి మాబు ఆర్.ఎం.పి డాక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ మాబు(75) ఆదివారము మృతి చెందడంతో ఈరోజు ఉదయం 6 గంటలకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయ బాదుడు సీజీ రాజశేఖర్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాల నుండి పెండేకల్లు ఆర్ ఎస్ కేంద్రంగా ప్రవేట్ ఆసుపత్రి నిర్వహిస్తూ ఆర్ఎస్ పెండేకల్ చుట్టుముట్టు 15 గ్రామాల ప్రజలకు అనేకమంది పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్నులను పొందారన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచి మనిషి డాక్టర్ మాబు మృతి తీవ్ర ఆవేదనాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆయన ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని, కుటుంబానికి సానుభూతి తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో తుగ్గలి మండలం జనసేన నాయకులు జనసైనికులు రాజేష్, వడ్డే విరేష్, వీరాంజి, రామంజి, ఇమామ్ వలి, సౌఖత్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com