Logo
Date of Publish : 28 July 2022, 4:19 pm
Editor : Sake Naresh

ప్రజాపోరాట యాత్రలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు సిజి రాజశేఖర్

      పత్తికొండ, (జనస్వరం) : పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం, టీ గోగులపాడు గ్రామంలో మండల నాయకులు నాగేశ్వరరావు, తిరుపాల్, ఖలీల్, ఆధ్వర్యంలో పర్యటించారు. అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ టీ గోగులపాడు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉంది. మేము ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు మాకు తెలుపుతున్న విషయాలు ఏమిటంటే, ఈ డ్రైనేజీ వ్యవస్థ బాగా లేకపోవడం వల్ల కొన్నిచోట్ల సిసి రోడ్లు లేక మురికి నీరు నుండి రోడ్లపై నిలిచిన దృశ్యాలు చూశానని అన్నారు. మురికి నీరు రోడ్లపై నిలచడం వల్ల గ్రామ ప్రజలకు డెంగ్యూ మలేరియా వంటి విశ్వజరాలు వస్తున్నాయని, బ్లీచింగ్ పౌడర్ కూడా మా గ్రామంలో సరిగా చల్లడం లేదని, కొన్నిచోట్ల డ్రైనేజీ కాలువలు ఉన్నప్పటికీ ఆ డ్రైనేజీ కాలువలు కూడా నిండిపోయిన పట్టించుకోని అధికారులు, అలాగే త్రాగే నీటిలో పురుగులు వస్తున్నాయని కొంతమంది వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీరు మా సమస్యలను మీ పార్టీ తరఫున అధికారులపై ఒత్తిడి పెంచి మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల కోరారని తెలిపారు. గ్రామం మొత్తం పర్యటించిన తర్వాత గ్రామ సచివాలయానికి వెళ్లి గ్రామస్తులు చెప్పిన సమస్యలపై పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడడం జరిగింది. పై అధికారులైనా ఎంపీడీవోకి ఫోన్ ద్వారా సమస్యలు వివరించడం జరిగింది. వెంటనే పరిష్కరించాలని లేదంటే జనసేనపార్టీ తరపున ఏం చేయాలో నేను చేసి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనపార్టీ నాయకులు సౌకత్, నరసింహుడు, రాముడు, షేక్షావలి, శ్రీకాంత్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com