పత్తికొండ ( జనస్వరం ) : టిడిపి పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ శ్యాంబాబు వారికి జనసేనపార్టీ తరఫున సంఘీభావం ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు CG రాజశేఖర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా సీఎంగా వ్యవహరించినటువంటి చంద్రబాబు గారిని గవర్నర్ పర్మిషన్ లేకుండా అక్రమ అరెస్టుపై ఖండించడం జరిగినది. వైయస్ జగన్ రెడ్డి 31 కేసులలో A1 ముద్దాయిగా ఉన్నప్పటికీ వాయిదాలకు హాజరు కాకుండా పదవిని అడ్డుపెట్టుకొని బెయిల్ పై తిరుగుతున్నటువంటి జగన్ రెడ్డి రాబోవు కాలంలో కచ్చితంగా జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించడం జరిగినది. 2024లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, పొత్తులో భాగంగా అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, జయరాముడు, గద్దల రాజు ,కంబగిరి, గద్దరాజు, చిరంజీవి, గల్లా రామచంద్ర, ఇస్మాయిల్ ,అజయ్ ,మనోహర్, అనిల్, వడ్డీ వీరేష్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com