పత్తికొండ, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్వీట్టర్లో రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి గురించి జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే గుమ్మడి కాయలు దొంగ ఎవరంటే భుజాల తడుముకున్నట్లుగా మంత్రి రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ మరియు వైసీపీ తదితర నాయకులు మీరందరూ భుజాలు తడుముకుంటున్నారని పత్తికొండ నియోజకవర్గం నాయకులు సిజి రాజశేఖర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గళమెత్తితే గొంతు తెగిన మేకలా వైసీపీ మంత్రులు అరుస్తున్నారని చూస్తూ చూస్తూ మూడుసంవత్సరాలు కాలంగడిచిపోయిన పోలవరం ప్రోజెక్టు పూర్తి చేయలేకపోయినందుకు సిగ్గు పడకుండా పవన్ కళ్యాణ్ ని అవమానకరంగా మాట్లాడం మంచి పద్దతి కాదని రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించేవారే అయితే మీ నాయకుడి పోలవరం పూర్తిచేసి మాట్లాడమని సవాల్ విసిరారు. రాజధాని పూర్తి చేయలేని నాయకుడిగా మీ నాయకుడు చరిత్రలో మిగిలి పోతారని ఆంధ్రులు హక్కు అయిన మోదికి మోకరిల్లి ప్రత్యేక హోదా మాట మరచి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి చేయలేక రాజధాని అమరావతిని అభివృద్ధి పరచలేక వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానిలో అంటూ రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ప్రజలు మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారు కనీసం మూడు రాజధాని అంశం పైన కూడా మీకు చిత్తశుద్ధి లేదని మాకు అర్థమైంది. ఎందుకంటే హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తక్షణమే మీరు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈరోజు మూడు రాజధానులు అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మీరు కేవలం రాజకీయ కోణంలో మీ పార్టీ మనవడు కోసం ప్రయత్నం చేస్తున్న రాజకీయ వికట క్రీడ అని రాష్ట్ర ప్రజలకు మాకు అర్థమైంది. అభివృద్ధి అంటే హైకోర్టు పాలన బిల్డింగు కాదు ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు కావాలి. ఈ ప్రాంతం నుంచి ఉపాధి లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. వలసలు ఆపాలి. ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత ఉపాధి కల్పించాలి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉత్తరాంధ్ర రాయలసీమలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు. ఎన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారని మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఇంకా మీరు చెప్పే కళ్లిబెల్లి మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని మీకు అర్థమైంది. మీ అస్మతను కప్పిపుచ్చుకునే కోసం నీతి నిజాయితీ నిబద్ధత మారుపేరైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద అక్కసు వెళ్లగక్కుతూ ప్రజలు నమ్మించాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని తెలుసుకోండి. అలాగే ఏ పార్టీలో ఉంటే ఆ నాయకుడి మెప్పు పొందడానికి రోజా హద్దు అదుపులేని విమర్శలు చేస్తుందని హోదాలో ఉండి దిగజారు విమర్శలు చేయడం ఎంత సిగ్గు చేటో ఆలోచించుకోవాలని సిజి రాజశేఖర్ విమర్శలు చేశారు.