
ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచన మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలం కోలగట్ల గ్రామం SC కాలనీ నందు తేలిక పార్టీ వర్షాలు కారణంగా SC కాలనీ ప్రజలు నడిచే రహదారి వర్షం నీరుతో గుంతలు, బురద మయంతో ఏర్పడడం జరిగింది. ఇప్పటికైనా కోలగట్ల గ్రామం SC కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు గుర్తించి SC కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు నిర్మించాలని అధికారులని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేనిపక్షంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యలు తీర్చే దిశగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగం మండల నాయకులు హాజరత్, గ్రామ ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.