పార్వతీపురం, (జనస్వరం) : సీబీఐ దత్తపుత్రుడుకి జనసేన సవాల్ అనే గోడ పత్రికను మంగళవారం జనసేన పార్టీ నాయకులు పార్వతీపురం జనసేన పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు టీమ్ పిడికిలి జిల్లా కోఆర్డినేటర్స్ మత్స.పుండరీకం చందక అనిల్, రెడ్డి కరుణ, వంగల దాలి నాయుడు, పైలా శ్రీను, పైలా లక్ష్మి తదితరులు మాట్లాడుతూ తమ పార్టీ జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అప్పుల, బాధలు ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న 300 మంది కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంటే అది చూసి ఓర్వ లేని రాష్ట్ర ముఖ్యమంత్రి సీబీఐ దత్తపుత్రుడు చనిపోయిన కౌలు రైతులను చూపించు అంటూ తన అతితెలివిని ప్రదర్శించడం విడ్డూరమన్నారు. జనసేన రైతు భరోసా యాత్రలో తాము ప్రపంచానికి చెప్పేది ఏమంటే… జనసేనాని తన సొంత డబ్బులిచ్చి ఆదుకున్న రైతుల్లో ఏ ఒక్కరైనా ఆత్మహత్య చేసుకోలేదని నిరూపించే దమ్ముందా వైసీపీ ముఖ్యమంత్రికికానీ, వైసిపి నాయకులు కానీ ఉందని ప్రశ్నించారు. చేతనైతే రైతులను ఆదుకోవాలి…అంతేకాని రైతులు కోసం కష్టపడుతున్న వారిని ఇబ్బంది పెట్టకూడదు అన్నారు. వైసీపీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. ఈ సందర్భంగా పట్టణ మెయిన్ రోడ్ లో వారు గోడ పత్రికను ఆటోలకు, పలు ప్రాంతాల్లో అంటించే కార్యక్రమం చేపట్టారు. టీమ్ పిడికిలిలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కౌలు రైతుల కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తూన్నారన్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక, విద్యుత్ చార్జీలు పెంచుతూ, పొలంలో సాగును భగ్నం చేసేందుకే మీటర్లు కార్యక్రమం చేపట్టి రైతులకు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అనంతరం మన్యం జిల్లా పరిధి నాలుగు నియోజకవర్గలకు టీమ్ పిడికిలి ప్రోజెక్టు రెండు మెటీరియల్ ని అందించారు.