మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నాలుగు వేల మంది పోలీసులతో విజయవాడ తాడేపల్లి ప్రాంతాన్ని అష్టదిగ్బంధం చేసి UTF ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడి అడ్డుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి భగ్నం చేస్తూ, పోలీసులు విజయవాడ తాడేపల్లికి వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్ట్ లు పెట్టి ప్రతి వాహనాన్ని ఆపేశారు. ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి వ్యతిరేకిస్తూ చలో విజయవాడకు ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలి వచ్చారు. కొంతమంది ఉపాధ్యాయులు విజయవాడ పాత ఆసుపత్రి ప్రభుత్వాసుపత్రికి రోగుల మాదిరిగా వచ్చే వారిని అదుపులోకి తీసుకున్నారని అన్నారు. జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్డు కి వెళ్లే చోట ముళ్ళ కంచె వేయడంతో వాటిని దాటడానికి ప్రజలు చాలా అవస్థలు పడ్డారని అన్నారు. ట్రాఫిక్ జామ్ అయి ఉండటంతో వాహనాలలోని ప్రజలు మండుటెండకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ విధంగా నెరవేర్చని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పలురకాలుగా ముప్పుతిప్పలు పెడుతోందని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com