• సీబీఐ దత్తపుత్రుడు ఒక విమర్శ చేస్తే పది విమర్శలు చేస్తాం
• జగన్ రెడ్డి గతం ఏమిటో ప్రజల ముందుపెడతాం
• సీబీఐ అనుమతి లేనిదే దేశం దాటలేని వాళ్ళా సుద్దులు చెప్పేది
• తిరుపతిలో మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్
తిరుపతి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సీబీఐ దత్తపుత్రుడు, ఎ-వన్ నిందితుడు అయిన జగన్ రెడ్డికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత లేదని పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇంఛార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. సీబీఐ కోర్టు అనుమతి లేకుండా అంతర్జాతీయ విమానం ఎక్కలేని జైల్ రెడ్డి అయిన జగన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు మీకే చేటని.. మీరు చేసే విమర్శలకు పది రెట్లు ప్రతి విమర్శలు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని మరోమారు సంబోధించినా.. ఆ ప్రస్తావన చేసినా జగన్ రెడ్డి గుట్టు ప్రజల ముందుపెడతాం. జనసేన పార్టీ అధ్యక్షులు ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడు, మరే పార్టీకి కాదు. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా నిపేందుకు రూ. 30 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించి, ప్రతి జిల్లాలో తిరుగుతూ ఆ కుటుంబాల యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ధైర్యం నింపుతూ అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడం హేయమైన చర్య. అవినీతి చక్రవర్తి అయిన జగన్ రెడ్డి దేశం దాటి వెళ్లాలంటే సీబీఐ అనుమతి తీసుకోవాలి. నిత్యం ప్రజా క్షేమం కాంక్షించే పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి మీకు లేదు. అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ముఖ్యమంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లమంటే ప్రజలడిగే ప్రశ్నలకు బదులివ్వలేక బయటకు వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు కూడా పారిపోయారు. ఇంకొందరు సాకులు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నారు. గడప గడపకు వెళ్తే జనాగ్రహానికి ఎక్కడ బలైపోవాల్సి వస్తుందోనన్న భయంతోనే వీరు ప్రజలకు ముఖం చాటేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు కష్టాల్లో చిక్కుకొంది” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు జె.రాజారెడ్డి, బత్తిన మధుబాబు, రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.