Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీతోనే కులాల ఐక్యత : అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య

జనసేనపార్టీ

           అనంతపురం ( జనస్వరం ) : రాయలసీమ ముఖ్యంగా అనంత జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకి, బోయలు గత కొన్ని దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్నారు. ప్రస్తుతం వైసిపీ, గత టిడిపి ప్రభుత్వాలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తు౦డడంతో అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారు. వాల్మీకి బోయలు అభివృద్ధి చెందాలంటే అది జనసేన తో మాత్రమే సాధ్యమవుతుందని… పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ… జిల్లాలో అత్యధిక శాతం బోయలు, వాల్మీకులు నేటికి ఆర్థిక సామాజిక పరంగా తీవ్ర వెనకబాటుకు గురయ్యారు అన్నారు. అధికార వైసిపి కానీ, గత టిడిపి ప్రభుత్వంలో కానీ వాల్మీకులు, బోయలకు ఆశించిన స్థాయిలో రాజకీయ పదవులు రాలేదన్నారు. కేవలం ఒకటి రెండు కుటుంబాలకు ప్రధాన పదవులు ఇవ్వడం, అక్కడక్కడ చిన్న చితక పదవులు కట్టబెట్టి యావత్‌ బోయ సామాజిక వర్గాన్ని ఉద్ధరించిన్నట్టుగా ప్రచారం చేసుకోవడం మినహా వారికి ఎలాంటి మేలు చేసిన దాఖలాలు లేవన్నారు. వాల్మీకులు బోయలు అభివృద్ధి చెందాలంటే అందుకు పవన్‌ కళ్యాణ్‌ లాంటి చిత్తశుద్ది పారదర్శకత కలిగిన నేతల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించే విధంగా ప్రణాళిక ఉండాలన్నారు.  ఈ రెండు పార్టీలు  అంత చిత్తపద్ది కనబరచలేదు. ‘అన్ని వర్గాల అభివృద్ధి అభ్యున్నతి కాంక్షించే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో వాల్మీకి బోయలతో పాటు బీసీలలోని అనేక సామాజిక వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్‌ సారథ్యంలో త్వరలోనే ఆయావర్గాలతో సమావేశం నిర్వహించి సమస్య మూలాలను అధ్యయనం చేసి వారి అభ్యున్నతికి పాటు పడతామని అన్నారు. రాష్ట్రంలో కులాల ఐక్యత కేవలం జనసేన పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని అంకె ఈశ్వర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way