Logo
Date of Publish : 17 December 2021, 2:17 am
Editor : Sake Naresh

చెరుకు రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి : జనసేనపార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు

  విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా పార్వతిపురం నియోజకవర్గం సీతానగరం మండలంలో గల లచ్చయ్యపేట సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చింది. చివరకు చెరుకు రైతులు సహనం కోల్పోయి ఫ్యాక్టరీ వద్ద నిరసన రూపంలో తమ గోడును ప్రభుత్వానికి యాజమాన్యానికి విన్నవించుకుందామని ఆందోళనకు దిగితే, ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వం పోలీస్ శాఖ ముగ్గురూ కలిసి రైతులను అక్రమంగా అరెస్టు చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. చివరకు రైతులపై లాఠీఛార్జి చేయడం రైతులు తీవ్ర గాయాలు పాలవ్వడం జరిగింది. వెంటనే జనసేన పార్టీ ఆ విషయం తెలుసుకొని రైతులకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. తరువాత రెండు రోజుల వ్యవధిలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారి ఆధ్వర్యంలో జనసైనికులు అంతా కలిసి తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి బొత్స సత్తిబాబు గారు పదిరోజుల్లో రైతులు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే రోజులు గడుస్తున్నా రైతులకు న్యాయం జరగకపోగా నిన్న రాత్రి సాలూరు మక్కువ సీతానగరం మొదలైన మండలాల్లో గల రైతులకు గ్రామానికి 5 మందికి చొప్పున దాదాపు పది సెక్షన్ల కింద రైతులపై కేసులు పెట్టి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో కంగారుపడ్డ రైతులు ఈరోజు ఉదయాన్నే రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారికి ఫోన్ చేయడం జరిగిన విషయం చెప్పడం జరిగింది. వెంటనే బాబు గారు స్పందించి మీకు మేము అండగా ఉంటామని చెప్పి బొబ్బిలి రూరల్ సిఐ ఆఫీస్ వద్దకు రైతులతో కలిసి వెళ్లి మాట్లాడారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రైతుల ఆవేదనను మీడియా ముందు చెప్పమని రైతులకు అవకాశం ఇచ్చిన తర్వాత మీడియాతో బాబు గారు కూడా మాట్లాడం జరిగింది. బాబు గారు మాట్లాడుతూ ఆరోజు బొత్స సత్తిబాబు గారు నిరసన చేసింది రైతులు కాదు జనసేన రైతు సంఘాలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పి అన్నారు. మరి ఈ రోజు రైతులు పైన ఏ విధంగా కేసులు పెడతారు అని మీడియా ముఖంగా నిలదీశారు. మీకు మీ ప్రభుత్వానికి సినిమా టికెట్లు రేట్లు గురించి మద్యం రేట్లు గురించి ఉన్న ఆసక్తి రైతుల పట్ల ఎందుకు ఉండట్లేదు అని ద్వజమెత్తారు. అలాగే రైతులకు మేము ఎప్పటికీ అండగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. వెంటనే రైతులకు న్యాయం చేయకపోతే జనసేన పార్టీ నిరసనను ఇంకా తీవ్రతరం చేస్తుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com