Logo
Date of Publish : 24 March 2026, 3:34 pm
Editor : Sake Naresh

శాంతి భద్రతల పరిరక్షణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు

శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా అనంతవరం గ్రామం నందు విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.

క్రోసూరు,మార్చి 24 ( జనస్వరం)

పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతవరం గ్రామం నందు సత్తెనపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ M. హనుమంతరావు ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో అనంతవరం గ్రామం నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు - 38, వేట కొడవలి - 01,గొడ్డళ్లు - 4,గడ్డ పలుగు - 1,మద్యం సీసాలు - 17,స్వాధీనం చేసుకున్నారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ అనంతవరం గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ వాడకం గురించి గ్రామంలోని పరిస్థితుల గురించి సత్తెనపల్లి డిఎస్పీ M. హనుమంతరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు డి ఎస్పీ హనుమంతరావు తెలిపారు. అంతేకాకుండా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కేసుల నిందితులతో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ ఆదేశానుసారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతవరం గ్రామం నందు జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి DSP M. హనుమంతరావు తో పాటు సత్తెనపల్లి టౌన్ సిఐ N.నాగమల్లేశ్వర రావు,సత్తెనపల్లి రూరల్ సీఐ హైమారావు,అమరావతి సీఐ Y.అచ్చయ్య,SI లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com