ప్రకాశం ( జనస్వరం ) : నరసాపురం లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డీ జనసేన పార్టీ నీ రౌడీ సేన అని అనడం మీద ధ్వజమెత్తిన కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్న జానకిరామ్. ఈ సందర్బంగా జానకి రామ్ గారు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి పాదయాత్రలో అన్ని వర్గాలకు దొంగ హామీలు ఇచ్చి ఈ రోజున నట్టేట ముంచిన ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి అని, ఈ జగన్ రెడ్డి పాలన లో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారని, ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బాధలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇది చూస్తున్న ఈ జగన్ రెడ్డీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ప్రజలు తన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారని భయమేసి, అభద్రతభావంలో అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని, ఎక్కడికక్కడ ప్రజా సమస్యల మీద పోరాడుతున్న జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. రాను రాను తన నీడను కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ జగన్ రెడ్డి లేడని, నిద్రపోయేటప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తలుచుకొని భయపడే స్థితిలో ఈ జగన్ రెడ్డి ఉన్నాడని, అసలు రాష్ట్రంలో దొంగలు ముఠా రౌడీ ముఠా లకు నాయకుడు ఈ జగన్ రెడ్డి అని, జీతాలు సరిగ్గా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి, మూడు రాజధానులు కడతాను అంటాడు. ఈ జగన్ రెడ్డి తెప్పించుకున్న నివేదికల్లో జనసేన పార్టీ బలంగా తయారైంది అని విషయం తెలియగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు దిగటం మొదలుపెట్టారు. ఒకటే చెప్తున్నాం మీ పతనం ఆరంభం అయింది, రాబోయేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ప్రజా ప్రభుత్వమే, తేల్చుకుందాం ప్రజాక్షేత్రంలో చూసుకుందామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com