Logo
Date of Publish : 17 May 2022, 5:23 pm
Editor : Sake Naresh

CBI దత్తపుత్రుడికి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు కనిపించలేదా ???

          నెల్లూరు ( జనస్వరం ) : రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న విషయాన్ని మరచినట్లుంది ఈ బెయిలు రెడ్డి ప్రభుత్వం అని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సిబిఐ దత్తపుత్రుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలలో అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రపంచం మొత్తం కరువుకాటకాలతో అల్లాడిపోతూ ఉంటే రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతో వర్ధిల్లు తుంది అని చెప్పడం హాస్యాస్పదం. అధికారంలో ఉన్న లేకుండా ప్రజల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి పాటుపడే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎటుచూసినా నిరసన సెగలు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల వ్యతిరేకతని తట్టుకోలేక ఫ్రస్టేషన్ తో ఇష్టమొచ్చినట్లు రాష్ట్రంపై అప్పులు భారం మేపారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చింది లేదు, జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఇచ్చింది లేదు పనిచేసే వారికి జీతాలు పెంచే పరిస్థితి లేదు రోడ్లన్నీ గతుకుల మయం. పల్లెల కనెక్టివిటీ రోడ్లు దారుణంగా ఉన్నాయి వాటి గురించి పట్టించుకునే నాథుడే లేదన్నారు. ముందస్తు ప్రణాళిక లోపంతో కరెంటు కోతలు మరియు కరెంటు కొరతతో రాష్ట్రం అల్లాడుతోంది. ఆర్థిక సమస్యలతో సతమతమై ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సొంత సంపాదన లక్ష రూపాయలు ఇచ్చేదాకా రైతు భరోసా ఊసే లేదు. నేలటూరులో ఏపీ జెన్కో స్థాపించేందుకు గాను రైతుల దగ్గర 14 వందల ఎకరాలు భూములు రైతుల వద్ద తీసుకుంటూ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని మాటతప్పింది ఈ బెయిల్ రెడ్డి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వం అన్న ఒక్క మాటని అడ్డుపెట్టుకొని మైండ్ గేమ్ కి సిధ్ధమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే దిశగా ఆలోచించాల్సింది పోయి అధికారాన్ని ఎలా కాపాడుకోవాలని దురుద్దేశంతోనే ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి సుజయ్ బాబు, సుధీర్, నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు నాయకులు సతీష్, హరి వరకుమార్ తదితరులు పాల్గొన్నారు ..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com