కార్వేటి నగరం, (జనస్వరం) : కార్వేటి నగరం మండలం, ఎల్ ఆర్ పేట పంచాయతీ, జగన్నాధపురం ఎస్టీ కాలనీలో జనసేన పార్టీ కార్వేటినగరం మండల కమిటీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ జనాధరణ నేత అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్నాధపురాన్ని ఆదుకోలేరా? నిరుపేదలకు నివాసం నిర్మించలేరా? అందులోనూ షెడ్యూల్డ్ తెగల కుటుంబాలకు అండగా నిలబడలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు కిలోమీటర్లు తారు రోడ్డు సౌకర్యం లేక ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆకస్మాత్తుగా ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రయాణానికి అనుకూలమైన రోడ్డు సౌకర్యం లేదని, మహిళలు ఆసుపత్రికి వెళ్లాలంటే వెళ్లలేనటువంటి పరిస్థితి, అననుకూలమైన ఇబ్బందుల మధ్య జీవనం సాగిస్తున్నారని వైసిపి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులకు వెంటనే తారు రోడ్డు నిర్మించి సౌకర్యవంతమైన ప్రయాణానికి త్వరితగతిన పనులు ప్రారంభించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. మద్యం షాపులు ఏర్పాటు చేయడంలో ఉన్న శ్రద్ధ మందికి మేలు చేయడంలో లేదని తెలిపారు. బండి రాక రేషన్ లేక, ఎఫ్ పి షాపుకి వెళ్లాలంటే తలప్రాణం తోక్కొస్తుందని ఎద్దేవా చేశారు. గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా బండి కోసం జనాలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మేలు అంటే బటన్ నొక్కడం కాదు, బతుకులను మార్చడం, బతుకులకు భరోసా కల్పించడం అని తెలియజేశారు. రాజు విఫలం చెందారు, మంత్రి మరీ ఘోర విఫలం చెందారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఇదేనా అని దుయ్య బట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, గౌరవ అధ్యక్షులు అన్నామలై, ఉపాధ్యక్షులు విజయ్, శ్యాం ప్రసాద్, సెల్వి, ప్రధాన కార్యదర్శులు నరేష్, దేవేంద్ర, హరీష్, మండల కార్యదర్శి నరసింహులు, రూపేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు పాల్గొన్నారు.