నూజివీడు ( జనస్వరం ) : పడమట దిగవల్లి గ్రామంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నూజివీడు ఎస్సీ సోదరుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నూజివీడు జనసేన పార్టీ తరపున పాల్గొని మద్దతు తెలిపిన నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు. అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలువేసి వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం కాకుండా కేవలం ప్రతి పక్షాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక కేసులు పెడుతూ అవినీతి అక్రమాలు చేస్తున్నాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వంలో వారి అవినీతి ఆక్రమాల లెక్కలు తెలుస్తామని అందరు సమిష్టిగా ప్రభుత్వ విధానాలపై పోరాడుదాం అని అన్నారు. టీడీపీ శ్రేణులతో పాటు జనసేన నాయకులు చిలి సతీష్, యంట్రపాటి సాయి, వేట త్రినాథ్, ఉప్పే నరేంద్ర గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com