
వెదురుకుప్పం, (జనస్వరం) : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామం వద్ద బ్యానర్ ను చింపివేసిన సందర్భంగా ” మలినమైన చేతులు మాలిన్యం లేని తనువును తాకినందుకు తనివితీరా తనువును తడిసే కార్యక్రమం” నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త ఏలుమలై జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం శుభ పరిణామమని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బ్యానర్ ను చెప్పగలరేమో గాని భావ జాలాన్ని చిది మేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ స్వాతంత్రోద్యమ వారసత్వ మని, ఇది అందర్నీ గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది అని తెలిపారు. బ్యానర్ ను చింపిన వ్యక్తిని, దానిని ప్రోత్సహించిన వారిని కోర్టు మెట్లు ఎక్కించగలను, కానీ మాది మానవత్వం మూర్తీభవించిన పార్టీ అన్ని వేళల, ఎల్లవేళల ఆదర్శంగా ఉండేది జనసేన పార్టీయే అని ఉద్గాటించారు. వైసిపి నాయకులు బ్యానర్లు కడితే దానిని చూసి మేము ఆనందిస్తామేతప్ప, ఇసుమంత అయిననూ బ్యానర్ను చంపాలనే ఆలోచన కానీ, దురుద్దేశ పూర్వకమైన దురాలోచన కానీ మాకు కలుగదు. వైస్సార్ విగ్రహాలను అక్కడక్కడ ధ్వంసం చేస్తే దానిని ఖండిస్తూ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని తెలపడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఇలాంటి దుశ్చర్యలను ఖండించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున కోరుకునేది, ప్రతి ఒక్కరి భావ ప్రకటన స్వేచ్ఛను హరించకుండా గౌరవిద్దాం, అది బ్యానర్ వేయడంలోనూ, విగ్రహాలు నెలకొల్పడంలోనూ సామరస్యపూర్వకమైన ధోరణి ప్రదర్శించాలనీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఒకరిని ఒకరు గౌరవించుకుందాం, ఇలాంటి సంఘవిద్రోహ చర్యలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, గౌరవ అధ్యక్షులు మధు, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి వేణు, ముని కార్వేటినగరం మండల గౌరవ అధ్యక్షులు భాను చందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్, కార్యదర్శి మహేష్, మోహన్ రెడ్డి, మండల జనసేన పార్టీ నాయకులు గుణ, ఉదయ్, శంకర్, వెంకటాద్రి, యుగంధర్, జనసైనికులు పాల్గొన్నారు.