– ప్రజల ఆశీస్సులతోనే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అవుతా
-2019 ఎన్నికల తర్వాత నుండి నేటి వరకు నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై, అధికార వైసీపీ తీరుపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాము
-నేను నియోజకవర్గం వదిలి పారిపోలేదు, ప్రక్క నియోజకవర్గాలను గెలకలేదు
-గత ఎన్నికల్లో నమ్మి ఓటీసిన ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నాను
-ఎంత కష్టపడుతున్నామో పవన్ కళ్యాణ్ గారికి పిన్ టూ పిన్ తెలుసు
-వినోద్ లాంటి వ్యక్తులు బలంగా నిలబడాలి అని నెల్లూరుకి వచ్చి ఆయనే స్వయంగా చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిని నింపాయి
-పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం
-పవనన్న ప్రజాబాటతో ప్రజల ఆశీస్సులు దక్కుతున్నాయి
-జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 261వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిన్నర క్రితం ఆనాటి జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసమర్థత వల్ల అన్నమయ్య డ్యామ్ తెగిపోయి సోమశిల జలాశయం ప్రమాదంలో పడి పెన్నాకు వరద పోటెత్తిన సమయంలో ఈ భగత్ సింగ్ కాలనీ మొత్తం నీట మునిగిందని, అంతకు ఏడాది ముందే నివర్ తుఫాను సమయంలో సోమశిల భద్రత, పెన్నా వరద తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ గారికి సమగ్ర నివేదిక ఇచ్చినా చర్యలు శూన్యమని, అన్ని రకాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉండింది కనుకే నేటికి కూడా ఈ ప్రాంతంలో ప్రమాదంలోనే ఉందని అన్నారు. ఈ ఒక్క అంశమే కాదని 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఆనాటి పరిస్థితుల దృష్ట్యా ఓటమి పాలైనా ఆత్మస్థైర్యం కోల్పోకుండా నాటి నుండి నేటి వరకు నియోజకవర్గంలో అనేక సమస్యల పైన నిరంతర పోరాటం చేస్తున్నామని అన్నారు. తాను నియోజకవర్గం వదిలి పారిపోలేదని, ప్రక్క నియోజకవర్గాలను ఏ రోజూ కూడా గెలకలేదని, పవన్ కళ్యాణ్ గారిని, తనను నమ్మి ఓటీసిన ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నానని, ఆ కష్టం ఎంతనేది పవన్ కళ్యాణ్ గారికి పిన్ టూ పిన్ తెలుసని అన్నారు. నివర్ తుఫాను సందర్భంలోనే నెల్లూరులో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వినోద్ లాగా ప్రజల కోసం కష్టపడి పనిచేసే వ్యక్తులు బలంగా నిలబడాలి అని స్వయంగా చెప్పిన మాటల స్ఫూర్తితోనే పవనన్న ప్రజాబాటకి అంకురార్పణ జరిగిందని, వచ్చే ఎన్నికల్లో పోటీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారమే ఉంటుందని, ఆయన మాటే తనకు శిరోధార్యం అని అన్నారు. ఎమ్మెల్యే అయి ప్రజల కోసం పని చేయాలనే ఆశ, తపన అనేకమందికి ఉంటుందని, పవనన్న ప్రజాబాటతో ప్రజల ఆశీస్సులు తనకు దక్కుతున్నాయని, పవన్ కళ్యాణ్ గారు అవకాశమిస్తే, కాలం కలిసొస్తే ప్రజల ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యే అవుతానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.