Logo
Date of Publish : 28 September 2021, 2:45 pm
Editor : Sake Naresh

సీఎం జగన్ రెడ్డికి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా? రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్

సీఎం జగన్ రెడ్డికి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా?
- క్రిస్టియన్స్ ని ఓటు బ్యాంకు వాడుకుంటూ నామినేటెడ్ పదవుల్లో వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా?
- నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా సామాజిక న్యాయం అంటారా?
- సామాజిక న్యాయం పేరుతో తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్న సీఎం జగన్
- ఈ మధ్య కొంతమందికి అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయించుకుని మతిస్థిమితం సరిగా లేదనుకుంటా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోవాలి?
- రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్
       విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి మతిస్థిమితం తప్పిందని అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, దమ్ముంటే సీఎం జగన్ రెడ్డికి కులపిచ్చి లేదని నిరూపించాలన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు గాని ఇతర ముఖ్యమైన పదవులు అన్నీకూడా జగన్ వారి సామాజిక వర్గం నుంచే భర్తీ చేశారని తెలిపారు. వెయ్యికి పైగా తన సామాజిక వర్గం వారికి కట్టబెట్టారని అందుకు సంబంధించిన వివరాలన్నీ పోసాని కూడా పంపిస్తామని అప్పుడు వారు జగన్ కి అని బహిరంగంగా ప్రకటించాలన్నారు. క్రిస్టియన్స్ ని ఓటు బ్యాంకు వాడుకుంటూ నామినేటెడ్ పదవుల్లో వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా... సామాజిక న్యాయం అంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం పేరుతో తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్న సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఈ మధ్య కొంతమందికి అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయించుకుని మతిస్థిమితం సరిగా లేదనుకుంటా అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com